Dil Raju: మరోసారి తెలంగాణ సీఎంను కలవనున్న దిల్ రాజు..! 1 d ago
మరోసారి టికెట్ రేట్ల గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడనున్నట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు. తాజాగా ఆయన మీడియా తో మాట్లాడుతూ "సినిమా ఇండస్ట్రీ కి ఎప్పుడూ అండగా ఉంటానని తెలంగాణ సీఎం మాకు చెప్పారు. ఒక నిర్మాతగా త్వరలోనే ఆయన్ని కలిసి టికెట్ రేట్ల గురించి ఆయనతో మాట్లాడతాను. తుది నిర్ణయం ప్రభుత్వానిదే. ఎలాంటి సమాధానం వచ్చిన తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను" అని దిల్ రాజు తెలిపారు.